NTV Telugu Site icon

Thummala Nageswara Rao: నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఇవే..

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao: నా ఆవేదన, నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు చెప్పదలచుకున్న అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఖమ్మం ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో తుమ్మల మాట్లాడారు. ఎన్టీరామారావు నాకు రాజకీయ అవకాశాలిచ్చారన్నారు. ఖమ్మం జిల్లా లో సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్న గోదావరి ప్రయాణం చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లా భూభాగం లో గోదావరి జలాలు లక్ష్యంగా పనిచేశానని తెలిపారు. నేను వున్న ప్రభుత్వం లో సీఎం లను ఒప్పించి గోదావరి జలాలను తెప్పించేందుకు ప్రయత్నం చేశామన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం కృషి చేశామన్నారు. కానీ ఆనాటి ప్రభుత్వం లో కొన్ని ప్రత్యేక పరిస్థితి లో దేవాదుల తీసుకుని వచ్చామన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో దుమ్ముగూడెం రెండు విభాగాలుగా చేశామని తెలిపారు. దుమ్ముగూడెం లిఫ్ట్ గురించి ఆనాడు రాజశేఖర్ రెడ్డి కి వివరించి చెప్పానని అన్నారు.

Read also: Guntur Drugs Case: గుంటూరు డ్రగ్స్ కేసు.. సాయి మస్తాన్‌ అరెస్టు!

ఆనాటి రాజకీయ పరిస్థితి లో రెండింటికీ టెండర్ లు వైఎస్ఆర్ పిలిచారు.. కానీ పూర్తి కాలేదు కానీ ఆ ప్రాజెక్టు కు తిలోదకాలు ఇచ్చారన్నారు. దుమ్ముగూడెం ప్రోజెక్ట్ కు నిధులు ఇవ్వమని కూడా నేను శాసనసభ్యుడు గా పాదయాత్ర చేశానని అన్నారు. నేను అభిమానించే వైఎస్ఆర్ అకాల మరణం పొందారు..కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చెప్పానన్నారు. గోదావరి జలాల కోసమే నేను టీఆర్ఎస్ లో చేరా అన్నారు. కేసీఆర్ తో టే పథకం మొదలు పెట్టించామన్నారు. రెండో సారి బీఆర్ఎస్ అధికారం లోకి వచ్చాక పంపు హౌస్ ల వరకే పరిమితం అయ్యింది సీతారామ అన్నారు. రోళ్ళ పాడు బయ్యారం అలైంజ్ మెంట్స్ మార్చారని, ప్రస్తుతం ముడు పంపు హౌస్ లు పూర్తి అయ్యాయన్నారు. ఇంకా చాల పనులు పూర్తి కావాల్సి వుందన్నారు. టన్నెల్ ల గురించి ఇంకా నిర్ణయం కూడా రాలేదన్నారు. నాకు రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ లోకి ఆహ్వానం వచ్చిందని తెలిపారు.

Read also: Revanth Reddy: నేటితో ముగియనున్న సీఎం విదేశీ పర్యటన.. రేపు హైదరాబాద్‌ కు రేవంత్‌ రెడ్డి

ముఖ్యమంత్రి నీ ఒప్పించి ఎన్కూరు లింక్ కెనాల్ ను త్రవ్వించానని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం తో మాట్లాడి గ్యాస్ పైప్ లైన్ క్రింద కెనాల్ నిర్మించామన్నారు. మోటార్ల గ్యారంటీ పిరియడ్ అయిపోయే సమయం కూడా దగ్గర పడిందన్నారు. అందువల్ల నిర్మాణం వేగవంతం చేశామని తెలిపారు. పెట్టిన పంపులు తియ్యాలెం, మోటార్లు తియ్యలేము.. అందువల్ల ప్రాజెక్టు ను యధాతధంగా నిర్మాణం చేపట్టుతున్నామని తెలిపారు. నా కృషి వల్ల పాలేరు లో రూపు రేఖలు మారిపోయాయన్నారు. కరువు తో అల్లాడుతున్న పాలేరు ను సస్యశ్యామలం చేశానని అన్నారు. కరువు తో అల్లాడి పోతున్న ఎన్కూరు అన్నారు. నేను అభిమానించే వ్యక్తులు, రాజకీయ నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి కూడా నా మీద మాట్లాడిన తీరు బాధాకరమని తెలిపారు.

Read also: Tollywood: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న చైతు జొన్నలగడ్డ, రవి ఆంథోని ‘ధార్కారి #MM పార్ట్ 2′

మీరు పూర్తి చేసి ఆ క్రెడిట్ ఎందుకు తీసుకోలేదన్నారు. అయిదేళ్ళు మీరు పట్టించుకోలేదని అన్నారు. పూర్తి చేయడం కోసం. కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. నాకు ఎకరం పొలం కూడా సాగు కాదన్నారు. నాది సత్తుపల్లి కాదు ఖమ్మం..నేను కీర్తి కోసం బ్రతికే మనిషిని కాదన్నారు. నేను చేసిన పని నాకు ఫ్లెక్సీ.. బిల్డింగ్, వంతెన, బ్రిడ్జి చూస్తే సంతోషిస్తానని అన్నారు. ప్రకటనలు, యాడ్స్ అనేవి ఈ రోజు చూసి రేపు పడేస్తారన్నారు. తాత్కాలిక ప్రచారం కోసం ఈ తుమ్మల అరరపడదు… గద్గద స్వరం తో తుమ్మల మాట్లాడారన్నారు. కళ్ళ వెంట నీరు తెచ్చుకున్నారు తుమ్మల. ప్రచారం కోసం క్రెడిట్ కోసం చేయ లేదన్నారు. సీతారాం పూర్తి కావడానికి మరో అయిదేళ్ళు పడుతుందన్నారు. ప్రాజెక్టు అడ్వైజర్ ను ఒప్పించి లింక్ కెనాల్ ను పూర్తి చేస్తున్నానని తెలిపారు.
Darling OTT: ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Show comments