Ponguleti Srinivas Reddy: మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దతో పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రభుత్వపాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అమ్మ ఆదర్శపథకంతో రూ. 657 కోట్లు తో ప్రభుత్వం వచ్చిన ముడునెల్లోనే చేపట్టి సౌకర్యాలు కల్పించిందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసిందిఏమిలేదన్నారు.
Read also: Minister Ponnam Prabhakar: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కు మంత్రి పొన్నం భూమి పూజ..
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10వేల 6 పోస్తులు డీఎస్సి ద్వారా ఇచ్చిందన్నారు. ఉపాద్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కలిపించిందన్నారు. గత ప్రభుత్వం అనేకస్కూల్ పెట్టిందే తప్ప పక్క వసతి కలిపించడంలో విఫలమైందన్నారు. అంతర్జాతీయ స్టాఅండ్ తో ఇందిరమ్మ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 125 నుంచి 150 కోట్లతో అద్భుతమైన స్కూల్ ఈ ప్రభుత్వం నిర్మాణం చేయబోతోందన్నారు. గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందన్నారు. ప్రభుత్వం వచ్చాక 300 కోట్ల తో అనేక కంపెనీలతో స్కిల్ డవలప్ మెంట్ నైపుణ్యం పెంపొందించే అవకాశం కలిపించిందని తెలిపారు. మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందన్నారు. ప్రవేటుకు దీటుగా పేద విద్యలకు కార్పొరేట్ విద్యానందించేందుకు ప్రభుత్వం కృషి చేసుందన్నారు.
Gold Rate Today: అంతా అయిపాయె.. పండగ వేళ ‘గోల్డ్’ షాక్!