NTV Telugu Site icon

దేశంలోనే ఖమ్మం మిర్చి మార్కెట్ పెద్దది: మంత్రి నిరంజన్ రెడ్డి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్లో రిజర్వేషన్ లు పెట్టిన తోలి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాలలో ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయరు. రైతే వెన్నుముక అన్న పార్టీలకు రైతు బంధు లాంటి పథకాలు అమలు చేయాలని ఆలోచన లేదు. కరెంటు అడిగితే కాల్చి చంపారు. మరో పార్టీ రైతు పంటలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని చట్టాలను కేంద్రం తెచ్చింది. సుప్రీం కోర్టు తాత్కాలిక నిలిపివేస్తాం అని చెప్పిందన్నారు.
దేశంలోనే ఖమ్మం మిర్చి మార్కెట్ పెద్దదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి.. కొనుగోలు పెరగాలంటే డిమాండ్ మీద పంటలు పండించాలి. వ్యాపార లావాదేవీలు ఆన్ లైన్ ద్వారా చేయాలి. వైరా కెవికె, వ్యవసాయ కళాశాలను సీఎం కేసీఆర్ తో చర్చించి మంజూరు చేయిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.