NTV Telugu Site icon

Khammam: ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం..!

Khammam

Khammam

ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ షెడ్‌లో పత్తి బస్తాలు తగలబడుతున్నాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటల్లో 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం తెలుస్తోంది. ఖరీదు చేసే పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

Read Also: Rekhachithram : మలయాళంలో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ

వ్యవసాయ మార్కెట్‌లో ఓ వ్యాపారికి చెందిన పత్తి సుమారు 200 బస్తాల అగ్నికి ఆహుతి కావటం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. హుటాహుటిన మార్కెటింగ్, ఫైర్‌ అధికారులతో మాట్లాడి తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో.. వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మార్కెట్ అగ్ని ప్రమాదంలో కాలిన పత్తి బస్తాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మంటలను అదుపు చేసేందుకు రెండు ఫైర్ ఇంజన్‌లు రంగంలోకి దిగాయి. కాలిపోయిన పత్తి విలువ లక్షల్లో ఉంటుందని ట్రేడర్లు అంటున్నారు. కాలిపోయిన పత్తి పాండురంగ, శ్రీను అనే వ్యక్తులదిగా పోలీసులు గుర్తించారు.

Read Also: Milk at Morning: పరగడుపున పాలు తాగే అలవాటు ఉందా..? అయితే ఇది మీకోసమే!

Show comments