NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే..

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy: గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాల భారిన పడిన వారిని మంత్రి సందర్శించారు. గత గడిచిన పది సంవత్సరాల కాలంలో గ్రామాల్లో మౌలిక వస్తులపై నిర్లక్ష్యం వహించటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మొన్నటి వరకు నేను నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగానని తెలిపారు. వందలాదిగా నాకు అప్లికేషన్లు వచ్చాయి గ్రామాల్లో మౌలిక వసతులు సరిగా లేవని తెలిపారు.మేము అంత చేసాం ఇంత చేసామనే ప్రభుత్వం ఏమి చేయలేదన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం ఒక పాలేరు నియోజకవర్గం లోనే కాదు రాష్ట్రమంతా పేదలకు అండగా ఉంటామన్నారు.

Read also: Mukesh Ambani: మరోసారి ముఖేష్ అంబానీ కళ్ళలో కన్నీళ్లు.. వీడియో వైరల్‌..

గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. వీలైనంతవరకు ఈ రోజే ముఖ్యమంత్రితో మాట్లాడతానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు రాష్ట్రానికి ఆయువుపట్టు అన్నారు. గ్రామీణ ప్రాంతాలకి రావలసిన నిధుల కొరతను ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడి గ్రాంట్ వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తానని అన్నారు. ధనిక తెలంగాణ అని చెప్పుకున్న గత ప్రభుత్వం చూస్తే మౌలిక వసతులకే కొరత కనపడుతుందని తెలిపారు. నేను గత ప్రభుత్వం మీద నింద మోపటం కాదు మౌలిక వసతులే సరిగా చేసుకోలేకపోయారని చెప్తున్నా అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తాం ఇదే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Assam Floods : అస్సాంలో వరద ఉధృతి.. ఇబ్బందుల్లో ఆరు లక్షల మంది ప్రజలు

Show comments