NTV Telugu Site icon

Munneru River: మున్నేరుకు మరో వరద ముప్పు..! 16 అడుగులకు నీటిమట్టం..

Munner River

Munner River

Munneru River: రాష్ట్రంలో వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు నదికి మరో వరద ముప్పు పొంచి ఉంది. మున్నేరు నది పొంగి పొర్లే అవకాశం ఉండడంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హడావుడిగా ఖమ్మం బయలుదేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఖమ్మం నగర కార్పోరేషన్ లోని దంసలాపురం న్యూ కాలనీలో మున్నేరు వరద ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వయంగా తరలించారు.

Read also: Weather Update: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్

నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల ఒకసారిగా మళ్ళీ మున్నేరుకు వరద పెరిగింది. గత వారం 30, 31 తేదీల్లో 36 అడుగులకు పైగా వరద వచ్చి చేరిన విషయం తెలిసింది. దీనివల్ల ఖమ్మం నగరంలోని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఉన్న కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 18 వార్డుల్లో ముంపు గురయ్యాయి .వారు ఇంకా బురద నుంచి కోలుకోక ముందే మళ్ళీ మున్నేరుకి వరద వచ్చింది గత రాత్రి మహబూబాబాద్ జిల్లా ఖమ్మం ప్రాంతాల్లో కురిసిన వరదంతా కూడా మున్నేరు వైపు వచ్చింది. దీంతో మున్నేరు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వచ్చింది 16 అడుగుల దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
Victory Venkatesh : వెంకీ మామయ్య సందడే సందడి.. స్పెషల్ వీడియో చూసారా..

Show comments