NTV Telugu Site icon

Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..

Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్ళీ పెరుగుతుంది. గత నాలుగు రోజుల నుంచి గోదావరి దోబూచులాడుతుంది ప్రస్తుతం 43 అడుగుల చేరువలో గోదావరి ఉంది. 43 అడుగులు దాటితే అధికారులు మొదటి ప్రమాదం జారీ చేయనున్నారు. అయితే రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగుల వరకు గోదావరి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read also: Kushaiguda Police: ఐదుగురు అధికారులపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు..

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 42.4 అడుగులకు చేరుకున్నది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా కొద్ది గంటల్లో గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా జనజీవనం పూర్తిగ స్తంభించిపోతుంది. అనేక నగరాలు నీట మునిగి ప్రజలు చాలామంది మృత్యువాత పడ్డారు. అలాగే పలుచోట్ల వరద నీరు రహదారులపై చేరుకొనీ రవాణా సౌకర్యాలు కూడా అనేక చోట్ల స్తంభించిపోయాయి. దీంతో ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకున్న తర్వాత వరద ప్రవాహం నిలకడగా ఉండి మరల రేపు సాయంత్రం నుంచి పెరిగే అవకాశం ఉన్నది. ఎగువ ప్రాంతాల్లో అనేక ప్రాజెక్టులలో కిందకు విడుదల చేయడం వల్ల భద్రాచలం వద్ద గోదావరి వరద పెరుగుతుంది.
Paralympics 2024: దేశం గర్విస్తోంది.. పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ..

Show comments