NTV Telugu Site icon

Bhadrachalam: రామయ్య సన్నిధిలో కొత్త విధానం.. అన్నదాన సత్రంలో డిజిటల్​ టోకెన్లు..

Bhdrachalam Ramayya

Bhdrachalam Ramayya

Bhadrachalam: భద్రాచల రామాలయంలో అన్నదానం కోసం డిజిటల్ టోకెన్ల జారీ ప్రత్యేకతను సంతరించుకుంది. అంతకు ముందు క్యూలో వేచి ఉన్న భక్తులకు పరిమిత సంఖ్యలో అన్నదానం టిక్కెట్లు ఇచ్చేవారు. నవంబర్ 13 నుంచి అన్నదానం డిజిటల్ టోకెన్లు ఇస్తున్నారు. దీనిపై QR కోడ్ ఉంటుంది. భక్తులకు ఫొటో తీసిన టోకెన్ కూడా ఇస్తున్నారు. ఈ టోకెన్‌ను అన్నదానం సత్రంలో చూపించి భోజనం చేయవచ్చిన ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో రోజూ 1500 నుంచి 2 వేల మంది అన్నదానం చేస్తున్నారు.

Read also:SP Sindhu Sharma: వీడిన ఎస్సై మిస్సింగ్ మిస్టరీ.. జిల్లా ఎస్పీ సింధు శర్మ కామెంట్స్..

ఈ విధానంతో అన్నదానం ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా సాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనాల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ఇచ్చిన వారి వివరాలతో పాటు దర్శనానికి వచ్చిన వారి ఫొటోలను డిజిటల్ టోకెన్ పై పెడుతుండటం గమనార్హం. ఈ డిజిటల్‌ టోకెన్‌ పై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్‌లో నిలబడకుండా ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయం పై ఆనందం వ్యక్తం చేశారు.

Read also: Ponnam Prabhakar: మంత్రి దృష్టికి పట్టణ సమస్యలు.. మార్నింగ్ వాక్‌లో ప్రజలతో పొన్నం

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేయనుంది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రోజూ 70 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం 4 లక్షల సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది. తిరుపతిలోని 8 కేంద్రాలు మరియు ఒక కేంద్రాల ద్వారా రోజుకు 40,000 టిక్కెట్లు చొప్పున 10 రోజులు తిరుమలలో. ఈ దర్శనం టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
CPI Narayana: సినీ ప్రముఖులతో సీఎం సమావేశం.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

Show comments