Khammam: ఖమ్మం జిల్లాలోని ఓ ఏటీఎంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఎన్ఎస్టీ రోడ్ సమీపంలోని కవిత కాలేజ్ వెడ్ ఉన్న ఎచ్ డి ఎఫ్ సి ఏటీఎంలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి గత కొంత కాలంగా నగదు బదిలీ చేయించుకుంటున్న వైనం సంచలనంగా మారింది. ఎచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నిర్వాహకులకు అనుమానం రావడంతో ముంబై నుండి కాల్ చేశారు. దీంతో ఏటీఎం నిర్వాహకులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా షాక్ కి గురయ్యారు. కొందరు ఏటీఎంను ట్యాంపరింగ్ చేసి నగదు చోరీ చేస్తున్నారని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఓ మహిళ ఏటీఎం వద్ద చోరీ చేస్తూ పట్టుబడినట్లు వెల్లడించారు. అదుపులో తీసుకున్న మహిళ బీహార్ కు చెందిన ప్రియాంక సింగ్ గా గుర్తించారు. మహిళ వద్ద రెండు ఆధార్ కార్డులు, రెండు పాన్ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెక్కీ నిర్వహించి ఓ మహిళను పట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే మరో ఇద్దరు పరారీలో వున్నట్లు తెలిపారు. ఏటీఎం నగదు చెల్లింపు విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎప్పటి నుంచి నగదు బదిలీ చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
Bandi Sanjay: భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..