Site icon NTV Telugu

Khairatabad: శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు.. రేపు మధ్యాహ్నం 12గంటలకు నిమజ్జనం

Khairatabad Vinayakudu

Khairatabad Vinayakudu

Khairatabad: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహా’ నిమజ్జనం మొదలైంది. నవరాత్రి పూజల నిమిత్తం ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణపతి” నిమజ్జన శోభాయాత్ర గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనం పూర్తవుతుంది. ఈ మేరకు పోలీసు శాఖ సూచన మేరకు మినిట్ టు మినిట్ విడుదల చేసింది.

శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
గణేష్ శోభాయాత్రకు నగరం ముస్తాబైంది. వీధివీధినా యాత్రికులు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. ఖైరతాబాద్‌లో దశ మహా విద్యాగణపతి కూడా వీడ్కోలు పలికారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మహా నిమజ్జన ఘట్టం పనులు ప్రారంభమయ్యాయి. శోభాయాత్ర కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఉప మండపంలో విగ్రహాలను సిద్ధం చేసి బడ గణేశుడికి అంతిమ పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి.

నిమజ్జన ప్రక్రియ ఇలా..

* మంగళవారం రాత్రి 11 గంటలకు ఖైరతాబాద్ లో గణపతి చుట్టూ నిర్మించిన షెడ్లను తొలగిస్తారు.
* రాత్రి 11 గంటలకు చిన్న క్రేన్లను ప్రాంగణానికి తీసుకువస్తారు.
* బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉపాలయాల విగ్రహాలను తరలించేందుకు ట్రాలీని సిద్ధం చేయనున్నారు.
* రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ కు భారీ క్రేన్ చేరుకోనుంది.
* రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య ఉప మండపాల్లోని విగ్రహాలను తరలిస్తారు.
* అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు శ్రీ దశ మహా విద్యాగణపతికి చివరి పూజ
* అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల వరకు చిన్న విగ్రహాలను ట్రాలీపై తీసుకువస్తారు.
* గురువారం అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భారీ వినాయకుడిని ట్రాలీపై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
* గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్య గణపతి విగ్రహాలను భారీ క్రేన్‌తో ట్రాలీపై తీసుకొచ్చారు. ఆ తర్వాత వెల్డింగ్ పనులు
* 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది
* ఉదయం 9:30 గంటలకు విగ్రహం ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది.
* ఉదయం 10:30 గంటలకు వెల్డింగ్ పని ప్రారంభమవుతుంది
* ఉదయం 10:30 నుంచి 11:30 వరకు స్వామివారికి పూజ కార్యక్రమం
* మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి విగ్రహ నిమజ్జనంతో ఉత్సవం పూర్తయింది.
Minister KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Exit mobile version