NTV Telugu Site icon

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడికి రేపే తొలిపూజ

Ganesh

Ganesh

హైదరాబాద్ గణేష్ ఉత్సవాల పేరు చెబితే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేష్. బుధవారం వినాయకచవితి సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. రేపు తొలిపూజ జరగనుంది. ఈభారీ గణపతిని చూడడానికి ఏటా లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాడు. ఈసారి ఈ పార్వతీతనయుడు పంచముఖ శ్రీలక్ష్మీ మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. 1954లో ప్రారంభమైన పెద్ద గణేష్ ప్రస్థానం 68 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది.

కరోనా మహమ్మారి వల్ల రెండేళ్లుగా గణేష్ ఉత్సవాలకు దూరమైన భక్తులు, ప్రజలు ఈసారి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకునేందుకు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మండపాలకు తరలివస్తున్న గణేష్ విగ్రహాలతో సందడి వాతావరణం ఏర్పడింది. ఖైరతాబాద్ గణేష్ మొదటి పూజకు గవర్నర్ తమిళిసై సౌందరరాన్ హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు యజ్ఞం తర్వాత.. పద్మశాలి సంఘం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 60 ఏళ్లలో తొలిసారి ఖైరతాబాద్‌ వినాయకుడిని మట్టితో తయారు చేశారు.

Read Also: Brahmaji: అంకుల్ అంటే కేసు వేస్తా.. అనసూయకు పోటీగా దిగిన బ్రహ్మాజీ

సుప్రీంకోర్టు ఆదేశాలను ఉత్సవ సమితి పాటించింది. అందులో భాగంగా మట్టి గణేషుడి పూజలందుకోనున్నాడు. ఈ ఏడాది జూన్‌ 10 నుంచి వినాయక విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. 150 మంది మంది కళాకారులు విగ్రహ తయారీలో పాల్గొన్నారు. శిల్పి రాజేంద్రన్ చేతుల మీదుగా ఖైరతాబాద్‌ గణేష్‌ తయారీకి కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకుంది. ఖైరతాబాద్‌ గణేషుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు తీరారు. గణేష్‌ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే జరగనుంది.

Read Also: Rayadurgam Rain: భారీవర్షంతో రాయదుర్గం అతలాకుతలం

Show comments