Site icon NTV Telugu

Kishan Reddy: గత పదేండ్లలో ప్రధాని మోడీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లలో ప్రధాని మోడీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా ఇవాళ కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు రెండు శాఖల బాధ్యతలు ఇచ్చారన్నారు. ఈ మేరకు ఇవాళ బొగ్గు, మైనింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. ఇప్పటి వరకు ప్రహ్లాద్ జోషి, అంతకు ముందు పీయూష్ గోయల్ ప్రధాని మోడీ ఆశీర్వాదంతో ఈ శాఖలో పనిచేశారన్నారు. ప్రజల జీవితాల్లో విద్యుత్ రంగం కీలకంగా ఉన్నదన్నారు. పదేండ్ల క్రితం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేదని అన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలు సమ్మె చేసిన ఘటనలు మనం చూశామన్నారు. కరెంట్, నీళ్ల కొరత ఉండేది. పంటలు ఎండిపోయేవి. అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లలో ప్రధాని మోడీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారు. ప్రధాని మోడీ నాయకత్వంలో గత పదేండ్ల నుంచి వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు సరిపోను కరేంట్ వస్తున్నది.

Read also: NEET Controversy: నీట్ వివాదంపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి.. ఏమ్మన్నారంటే..?

దానికి ప్రధానమైన కారణం.. బొగ్గు అన్నారు. దీని ద్వారానే ఈరోజు ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి మనం కొంత దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయెలా బొగ్గు ఉత్పత్తిని పెంచుతామన్నారు. దేశంలో ఉన్న ఖనిజాలను బయటకు తీయడం, ఉపాధి అవకాశాలను పెంచడం, భారత్ ఖనిజాలను ఇతరదేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామన్నారు. దేశ ప్రజల ఆకాంక్షల మేరకు, మోడీ సంకల్ప్ పత్రంలో పేర్కొన్నట్టుగా ఈ ఐదేండ్లు పూర్తి స్థాయిలో నాకు అప్పగించిన శాఖల బాధ్యతలను నెరవేరుస్తానని తెలిపారు. శక్తివంతమైన భారత్ ను రూపొందించడంలో బొగ్గు, మైనింగ్ శాఖల పాత్ర కీలకం అన్నారు. దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ శాఖల్లో చాలా సీనియర్, ఉత్తమ అధికారులు ఉన్నారన్నారు. వారందరితో కలిసి టీమ్ వర్క్ తో పనిచేసి భారత్ ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు.
Drug Sales in Hyderabad: పాతబస్తీలో డ్రగ్స్‌ పట్టివేత.. సాఫ్ట్‌వేర్లతో పాటు ప్రముఖులకు సరఫరా

Exit mobile version