సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి చేరుకున్నారు. కేసీఆర్ ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ పున:నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. మహా సుదర్శన యాగాల తేదిలతో పాటు ఆలయ పున: ప్రారంభ తేదిలను కూడా నేడు ప్రటించే అవకాశం ఉంది. మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు, సీఏఓం అధికారులు పాల్గొన్నారు. ఆలయ పనులతో పాటు అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు.
యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్
