CM KCR: ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ప్రతిసారీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే ముందు ఈ ఆలయంలో పూజలు చేసేందుకు కేసీఆర్ వస్తుంటారు. ఈసారి బీఆర్‌ఎస్ సమావేశాల పరంపర జరగనుంది. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. కోనాయిపల్లి వెంకటేశ్వర దేవాలయం సీఎం కేసీఆర్‌కు, పార్టీకి సెంటిమెంట్. ఏ ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. ఎన్నికల వేళ సీఎం కేసీఆర్, హరీశ్ రావు తదితర పార్టీల నేతలు వెంకన్నను దర్శించుకుని స్వ మివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు వేసి పూజలు చేస్తారు. 1985 నుంచి ప్రతి ఎన్నికల ముందు శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇక్కడ ఆలయ ప్రవేశం దక్షిణం వైపు ఉంది. ఇలాంటి దక్షిణాభిముఖ దేవాలయాలు చాలా అరుదు. అదొక స్పెషాలిటీ అని కూడా చెప్పొచ్చు. పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్ రావు ఆలయాన్ని రూ. 3 కోట్లకు పైగా వెచ్చించి ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం, మూలవిరాట్, ప్రహరీ నిర్మాణాలు చేపట్టారు. ఫిబ్రవరి 2022లో ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో మరో రూ.50 లక్షలతో కల్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ విజయం సాధించారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినందున 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018 ఎన్నికల సందర్భంగా ఈ ఆలయంలో పూజలు చేసి నామినేషన్లు వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించాడు. 2001లో సీఎం కేసీఆర్ టీడీపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఈ ఆలయంలో పూజలు చేసి టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) పార్టీని ప్రకటించడం మరో విశేషం.
Minister KTR: నేడు చలో జల విహార్ సభ.. హాజరు కానున్న మంత్రి కేటీఆర్