Site icon NTV Telugu

నేడు తెలంగాణభవన్‌లో కేసీఆర్ సమావేశం

KCR

KCR

హుజురాబాద్‌ ఉప ఎన్నిక వేళ.. మళ్లీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ బాస్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇవాళ టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కాబోతోంది. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అలాగే . గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు.. పార్టీ శాఖల ఏర్పాటు కోసం షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది.

దళితబంధు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు… పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా రాష్ట్ర కమిటీ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్.. ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సభ్యత్వ నమోదును పూర్తి చేసుకుని… క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు ప్లాన్‌ చేస్తున్న టిఆర్ఎస్‌.. భవిష్యత్‌ వ్యూహరచన కోసం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.

Exit mobile version