Site icon NTV Telugu

Ayodhya Special Train: నేడు కాజీపేట నుంచి అయోధ్యకు రైలు.. సాయంత్రం 6.20 గంటలకు..

Kajipet To Ayodhya Train

Kajipet To Ayodhya Train

Ayodhya Special Train: అయోధ్య బలరాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఇవాళ కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాజీపేట నుండి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరుతుంది. గత నెల 30న బయలుదేరాల్సిన ఆస్తా ప్రత్యేక రైలు సాంకేతిక కారణాలతో రద్దయింది. మళ్లీ ఈ రైలు పాత ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకారమే నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కాజీపేట నుండి రైలు నెం. 07223 జనవరి 30, ఫిబ్రవరి 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో మొత్తం 15 ట్రిప్పులు నడుస్తుంది. అయోధ్య నుండి కాజీపేట వరకు నడుస్తుంది. ఫిబ్రవరి 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీల్లో భక్తులకు అందుబాటులో ఉంటుంది. కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరిన రైలు మరుసటి రోజు రాత్రి 9.35 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు అయోధ్యలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.02 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. ఈ రైలు పెద్దపల్లి మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, జుజర్‌పూర్, ఇటార్సీ, భూపాల్, బీనా, విరంగన, ఝాన్సీ, ఒరై, ఖాన్‌పూర్, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 20 స్లీపర్ కోచ్‌లు, 2 జనరల్ బోగీలు ఉన్నాయి.

Read also: Free WiFi: మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు.. 15 నుంచి 25 వరకు..

అయోధ్య బలరాముడి దర్శనం కోసం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ‘ఆస్తా’ సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన విసయం తెలిసిందే. ఈ ప్రత్యేక రైలును బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలులో రామ్‌లల్లా దర్శనం కోసం 1,346 మంది అయోధ్యకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంగణం అంతా రామ నామస్మరణతో మారుమోగింది. ఈ ప్రత్యేక రైలు అయోధ్యను సందర్శించిన తర్వాత 9వ తేదీన తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

07221 సికింద్రాబాద్ నుండి అయోధ్యకు ఫిబ్రవరి 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. అదే నంబర్‌తో అయోధ్య నుండి ఫిబ్రవరి 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3. సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. ఇది అయోధ్య నుండి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది కూడా కాజీపేట నుండి బయలుదేరి ఆస్తా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు ఆగిన అన్ని స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్ , సికింద్రాబాద్ లలోని సామాన్య ప్రజల కోసం ఆస్తా అయోధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి రావడం ప్రజలకు మంచి సౌలభ్యం అని చెప్పవచ్చు.
Udhayanidhi Stalin: ప్రధాని మోడీ ఓబీసీ కావడం వల్లే శంకరాచార్యలు ప్రాణ ప్రతిష్టకు రాలేదు..

Exit mobile version