Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంచతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో శైవక్షేత్రాలు భక్తులతో కిట కిటలాడాయి. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి శివాలయాల్లో మహా న్యాసం, ఏకాదశ రుద్రాభిషేకంతో పూజలు ప్రారంభమయ్యాయి. కార్తీకమాసంలో చేసే స్నానం, జపం, తపస్సు, దానధర్మాలు, ఉపవాసాలు అనంత పుణ్యఫలాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.. అందుకే ఈ ఏడాదంతా ఎలా ఉన్నా.. ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మాసమంతా ఆధ్యాత్మిక ఆనందమయ వాతావరణం.
పూజలు, అన్నదానం, జపం, ఈ మాసంలో ఉపవాసాలు చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా దీపారాధన శ్రేష్ఠమని, దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల సర్వపాపాలు తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనికి గుర్తుగా శుక్రవారం తులసి చెట్టు వద్ద మహిళలు 365 వత్తులను నేతితో వెలిగిస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో తలంటు స్నానం చేసి పూజలు చేసి ఆలయాలను సందర్శిస్తారు. శివుని ఆరాధించే భక్తులు ఉపవాస దీక్షలు చేసి ప్రదోష కాలంలో స్వామికి అభిషేకం చేసి మారేడు దళాలతో పూజలు చేస్తారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా కార్తీక పౌర్ణమి సందర్బంగా వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు పోటెత్తారు. ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. సాయంత్రం ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణం నిర్వహించనున్నారు. జగిత్యాల జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి గోదావరి నదిలో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్దలతో కార్తీక దీపాలను ఒదులుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర,చత్తీస్ గఢ్ ,ఎంపీ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు,గోదావరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు,విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఉసిరిచెట్టు వద్ద దీపాలను వెలిగిస్తున్నారు భక్తులు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అతిథిగా బాపట్ల సూర్యలంక కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా కేసి కెనాల్ వినాయక ఘాట్ వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించి వినాయక ఘట్ లో భక్తులతో వదులుతున్నారు. సత్యనారాయణ స్వామి ఆలయం, మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయాల్లో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
బాపట్ల సూర్యలంక సముద్రతీరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రత్యేక పూజలు చేసి సాగర హారతి ఇచ్చారు. తెల్లవారుజామునుంచే పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలతో పూజలు నిర్వహిస్తున్నారు. సూర్యలంక సముద్రతీరం హరోం హర, శంభో శివ శంభో అంటూ శివనామస్మరణతో మార్మ్రోగింది. భక్తజన సందోహంతో సముద్రతీరాన బారులు తీరింది.
AP Assembly 2024: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!