Tspsc Paper Leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను కొనసాగిస్తుంది. తాజాగా ఈ కేసులో కరీంనగర్‌కు చెందిన తండ్రీకూతుళ్లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్ తన కూతురు సాహితీ ఏఈ పరీక్ష రాయడానికి రమేష్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ కు సంబంధించి రూ. 30 లక్షలకు రమేష్‌తో శ్రీనివాస్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో శ్రీనివాస్, సాహితిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు వారిని బుధవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం మేజిస్ట్రేట్ జి ఈశ్వరయ్య వారిద్దరికీ ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Read also: Delhi: రీల్స్ చూసి బ్యాంకు ఉద్యోగిని దోచుకున్న విద్యార్థులు.. అరెస్టు చేసిన పోలీసులు
మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఆరుగురిని సిట్ బృందం బుధవారం అరెస్ట్ చేసింది. నీటిపారుదల శాఖలో పనిచేసిన అసిస్టెంట్ ఇంజనీర్ పి రమేష్ నుంచి ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. వారి నుంచి సేకరించిన తర్వాత మరికొందరిని సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన రమేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఏఈఈ పరీక్షలో మాస్ కాపీయింగ్ నిర్వహించిన రమేష్.. ఆపై ఏఈ పరీక్ష పేపర్‌ను చాలా మందికి విక్రయించాడు. రమేష్ నుంచి దాదాపు 40 మంది ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రమేష్ నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన వారిని సిట్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. అలాగే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సిట్ కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 80 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Tomato Price Hike: పక్క దేశం వెళ్లి టమాటాలను తెచ్చుకుంటున్న జనం.. అక్కడ చాలా చీప్ గురూ