NTV Telugu Site icon

SP Sindhu Sharma: వీడిన ఎస్సై మిస్సింగ్ మిస్టరీ.. జిల్లా ఎస్పీ సింధు శర్మ కామెంట్స్..

Sp Sindhu Sharma

Sp Sindhu Sharma

SP Sindhu Sharma: ఎస్సై సాయికుమార్‌ మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. కామారెడ్డి జిల్లా భీక్కునూర్ ఎస్సై సాయికుమార్, బీబీ పెట్ కానిస్టేబుల్ శృతి, సొసైటీ ఆపరేటర్ నిఖిల్ మృత దేహాలు లభ్యమయ్యాయి. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుండి ముగ్గురు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. నిన్న మధ్యాహ్నం నుండి ముగ్గురు మిస్సింగ్ పై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలను పోలీసుల వెలికితీసారు. ఈరోజు ఎస్సై సాయికుమార్ మృతదేహం గుర్తించారు.

Read also: Tollywood Industry Meeting Live Updates: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశం.. లైవ్‌ అప్‌డేట్స్!

అనంతరం కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ.. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు మృతదేహాలు లభ్యం అయ్యాయని తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారం మిస్సయి న ముగ్గురు ఆచూకీ గుర్తించామని ఎస్పీ సింధు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకూ ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమన్నారు. ఎస్సై జేబులోనే సెల్ ఫోన్ గుర్తించామని అన్నారు. విచారణ కొనసాగుతోంది.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ సింధు తెలిపారు.
Ponnam Prabhakar: మంత్రి దృష్టికి పట్టణ సమస్యలు.. మార్నింగ్ వాక్‌లో ప్రజలతో పొన్నం

Show comments