Site icon NTV Telugu

Ponnam Prabhakar: ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయండి..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. వడ్లు కొనుగోలు చేసిన 24 గంటల లోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని రైతులు మంత్రికి వివరించారు. ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలుకు క్వింటాల్ కి రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. తనకి బోనస్ డబ్బులు జమ అయ్యాయని రైతులు మంత్రికి చూపించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రతిపక్షాలు కావాలని కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేశారని మండిపడ్డారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేవని మంత్రి స్పష్టం చేశారు.
Eye Care: కళ్లను రుద్దు తున్నారా.. ఇన్ఫెక్షన్ కు దారి తీసే అవకాశం..

Exit mobile version