Karimnagar: కరీంనగర్ జిల్లా కరీంనగర్ మేయర్ సునీల్ రావు సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ విడుదల చేశారు. గతంలోనూ సంజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ ఫోటోలతో సునీల్ పోస్టర్ పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి గా సంజయ్ మొదటి సారి వచ్చిన సమయంలో మేయర్ సునీల్ రావు కలిసారు. అయితే ఆయన పార్టీ మారే యోచనలో వున్నట్లు తెలుస్తుంది.
దీనికి నిదర్శనమే బండి సంజయ్ పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ పోస్ట్ లో కేసీఆర్, కేటీఆర్ ఫోటో లేకుండా తన ఫోటో పెట్టడం అని పార్టీ వర్గాలు సీరియస్ అవుతున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫోటో లు లేకుండా విషెస్ పోస్టర్ వేయడం పై చర్చలు మొదలయ్యాయి. మేయర్ కూడా కారు దిగి కసాయం కండువా కప్పుకుంటారనే వార్తలు మొదలయ్యాయి. మరి దీనిపై ఇంకా క్లారిటీ ఎందుకు ఈ పోస్టర్ చాలు అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అయితే దీనిపై మేయర్ సునీల్ రావు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై స్పందన కూడా లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
Read also: Gautham Menon: ముచ్చటగా మూడోసారి.. కానీ అక్కడ మొదటిసారి.
ఇక మరోవైపు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫ్లెక్సీ రగడ మొదలైంది. జన్మదినం సందర్భంగా మండలంలో పలుచోట్ల బండి సంజయ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎల్ఎండి క్యాంపు కార్యాలయ సమీపంలో ఫ్లెక్సీ కడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారని బీజేపీ నాయకుల ఆరోపణలు చేస్తున్నారు. క్యాంపు కార్యాలయం దగ్గర ఫ్లెక్సీ కడితే మా సార్ ఒప్పుకోడు అంటూ అనుచరుల హంగామా సృష్టించారు. ఎమ్మెల్యే అనుచరుల పట్ల బీజేపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mallu Bhatti Vikramarka: ప్రజల సమస్యలు తెలుసు.. కానీ అభిప్రాయం తీసుకుంటాం..