Site icon NTV Telugu

Mayor Sunil Rao: బీఆర్ఎస్ కు షాక్.. బండి సంజయ్ తో కరీంనగర్ మేయర్ భేటీ..

Karimnagar Meyor Sunil Rao

Karimnagar Meyor Sunil Rao

Mayor Sunil Rao: కేంద్రమంత్రి బండి సంజయ్ తో కరీంనగర్ మేయర్ సునీల్ రావు భేటీ అయ్యారు. పలువురు కార్పొరేటర్ లతో కలిసి ఓ హోటల్ లో బండి సంజయ్ తో మేయర్ భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీ నిధుల కోసం మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలిసామని అంటున్నారు. కొంతకాలంగా బండి సంజయ్ తో మేయర్ సన్నిహితంగా ఉంటున్నారని టాక్. ఎన్నికల ముందు వరకు బీజేపీ, బండి సంజయ్ పై మేయర్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాక సునీల్ రావు పలు మార్లు కలిశారు. అంతేకాకుండా.. తాజాగా సంజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో మేయర్ పెట్టిన పోస్ట్ లు వైరల్ అయ్యాయి. సునీల్ రావు బీజేపీ లో చేరడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది.

Read also: Cyber ​​Fraud: అమెరికాలో ఆపదలో కూతురు.. రక్షిస్తామంటూ తండ్రికి సరికొత్త సైబర్ వల..

జూలై 11న (గురువారం) సోషల్ మీడియాలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు పోస్ట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ విడుదల చేశారు. గతంలోనూ సంజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ ఫోటోలతో సునీల్ పోస్టర్ పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి గా సంజయ్ మొదటి సారి వచ్చిన సమయంలో మేయర్ సునీల్ రావు కలిసారు. అయితే ఆయన పార్టీ మారే యోచనలో వున్నట్లు తెలుస్తుందని వార్తలు వచ్చాయి. అలాంటి ఏమీ లేదంటూ కొట్టిపడేశారు సునీల్ రావు. అయితే ఇప్పుడు బండి సంజయ్ విషెష్ చేస్తూ పోస్ట్ పెట్టడంతో సునీల్ రావు బీజేపీలో చేరడం ఖాయమని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నారు.

Read also: Nalla Pochamma Bonalu: ప్రజాభవన్‌ లో బోనాల సందడి.. నల్ల పోచమ్మ ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి

దీనికి నిదర్శనమే బండి సంజయ్ పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ పెట్టిన పోస్ట్ లో కేసీఆర్, కేటీఆర్ ఫోటో లేకుండా తన ఫోటో పెట్టడం. ఈ పోస్ట్ పై పార్టీ వర్గాలు సీరియస్ అవుతున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫోటో లు లేకుండా విషెస్ పోస్టర్ వేయడం పై చర్చలు మొదలయ్యాయి. మేయర్ కూడా కారు దిగి కసాయం కండువా కప్పుకుంటారనే వార్తలు మొదలయ్యాయి. మరి దీనిపై ఇంకా క్లారిటీ ఎందుకు ఈ పోస్టర్ చాలు అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అయితే దీనిపై మేయర్ సునీల్ రావు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై స్పందన కూడా లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుండగా ఇవాళ మళ్లీ మేయర్ సునీల్ రావు.. బండి సంజయ్ తో భేటీ కావడంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Sangareddy: అంగట్లో సరుకుల్లా నర్స్ పోస్టులు.. అమ్మకానికి పెట్టిన కిలాడి లేడీలు..

Exit mobile version