Mayor Sunil Rao: నగరపాలక కార్పోరేటర్లు బండిసంజయ్ కలిస్తే తప్పేముందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. స్మార్ట్ సిటి కోసం 735 కోట్లు ఖర్చు చేసామని తెలిపారు. బండి సంజయ్ సహకారం వల్లనే నాలుగు వందల కోట్లకు పైగా నిధులు నగరానికి వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము బండిసంజయ్ ని కలవడం మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఇష్టం లేదని మండిపడ్డారు. నగరపాలక కార్పోరేటర్లు బండిసంజయ్ కలిస్తే తప్పేముంది? అని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ఎనిమిది నెలలు అవుతున్న ఒక్క రూపాయి తీసుకురాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరపాలక నిధులపై విజిలెన్స్ విచారణ అయినా ఎలాంటి విచారణ కైనా మేము సిద్దమని తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఎవ్వరినైనా కలుస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నగరపాలక రివ్యూ మీటింగ్ పెట్టి నెలరోజులు అవుతుంది… ఏమిచ్చాడు? అని ప్రశ్నించారు. బండిసంజయ్ పై గతంలో మేము చేసిన విమర్శలు ఎన్నికల ముందు చేసే రాజకీయ విమర్శలు మాత్రమే అన్నారు.
Read also: Darling Pre Release Event: అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నాని: ప్రియదర్శి
తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ తో కరీంనగర్ మేయర్ సునీల్ రావు భేటీ అయిన విషయం తెలిసిందే.. పలువురు కార్పొరేటర్ లతో కలిసి ఓ హోటల్ లో బండి సంజయ్ తో మేయర్ భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీ నిధుల కోసం మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలిసామని అంటున్నారు. కొంతకాలంగా బండి సంజయ్ తో మేయర్ సన్నిహితంగా ఉంటున్నారని టాక్. ఎన్నికల ముందు వరకు బీజేపీ, బండి సంజయ్ పై మేయర్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాక సునీల్ రావు పలు మార్లు కలిశారు. అంతేకాకుండా.. తాజాగా సంజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో మేయర్ పెట్టిన పోస్ట్ లు వైరల్ అయ్యాయి. సునీల్ రావు బీజేపీ లో చేరడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది.
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు..! అది ఎలా..?