Karimnagar: రాష్ట్రంలో కుక్కల దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిపై దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి.ప్రభుత్వం కుక్క నివారణ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోటు దాడులు వెలుగులోకి వస్తూనే వున్నారు. తాజాగా కరీంనగర్ లో జరగిన ఘటన దిగ్భ్రాంతిని కలగించేలా చేసింది.
Read also: Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్!
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు కుక్కల దాడులు పెరుగుతున్నాయి. వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డు పక్కన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. అక్కడే వున్న రెండేళ్ల చిన్నారి హరినందన్ పై ఒక్కసారి వీధి కుక్క దాడి చేసింది. హరినందన్ మొఖం తలను గట్టిగ పటుకుని కిందికి పడేసింది. చేతులపై దాడి చేసింది. హరినందన్ గట్టిగ కేకలు వేయడంతో అక్కడే వున్నవారు కుక్కను అక్కడి నుంచి తరలించారు. అయితే కుక్క దాడిలో హరినందన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ముఖం, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితులు మాట్లాడుతూ.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయని వాపోతున్నారు. నడిరోడ్డుపై వెళ్లాలంటేనే భయంగా వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చిన్నారి హరినందన్ పై వీధి కుక్క దాడి నిదర్శనమని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరెన్నో జరిగాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు అధికారులను కోరారు.
Uttarakhand : కేదార్నాథ్కు వెళ్లే సన్ ప్రయాగ్-గౌరీకుండ్ రహదారిపై విరిగిపడిన కొండచరియలు