NTV Telugu Site icon

BRS MLA Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు..

Padi Koushik Reddy

Padi Koushik Reddy

BRS MLA Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం విశేషం. నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సిఈవో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని జడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం పాడికౌశిక్ రెడ్డిపై సెక్షన్ 221,126 (2} కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం అమలులొకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయడంపై సర్వత్రా చర్చకు దారితీసింది.

Read also: Garudan: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్

కరీంనగర్ జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో నిన్న (మంగళవారం) గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షించే హక్కు లేదన్నారు. కౌశిక్ రెడ్డి తన సమీక్షకు హాజరైన వారికి నోటీసులివ్వడంపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ముందస్తు గ్రామ మోషన్ వేస్తానని చెప్పడంతో గందరగోళం నెలకొంది. దళితుల బంద్‌ సమస్యతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి సమస్యపై కలెక్టర్‌ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేయడంతో కలెక్టర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ వెళ్లకుండా మెట్లపై బైఠాయించారు. ఆ తర్వాత డీఈవోను సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే..
Student Unions: రేపు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్‌..?