NTV Telugu Site icon

Revanth Reddy: నేను కామారెడ్డిలో పోటీ చేస్తుంది అందుకే.. క్లారిటీ ఇచ్చిన రేవంత్‌

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగా అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కామారెడ్డి భూముల పై కన్నేశాడని మండిప్డారు. పొరపాటున గెలిపించారో భూములన్నీ పోతాయని అన్నారు. ఆ తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ప్రచారం కోసం గ్రామ గ్రామాన తిరగాలని ఉండే అన్నాఉ. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఎక్కువగా ఉండి రాలేక పోయా అన్నారు. మీరు ఆశీర్వదించండి.. ప్రతీ ఒక్కరిని కలుస్తా.. సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్, ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే అన్నారు. కానీ ఇప్పుడొచ్చి ఆయనకు ఓటు వేయాలని అడుగుతున్నాడని మండిపడ్డారు. పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కొనాపూర్ ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందట అని వ్యంగాస్త్రం వేశారు.

Read also: BJP MP Laxman: కర్ణాటక ప్రజల సొమ్ముతో ప్రకటనలు.. వేలం పాటలా పోటీ పడి పథకాలు

ఏనాడూ గల్ఫ్ కార్మికులను, బీడీ కార్మికులను ఆదుకోలేదన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల కాదని కేసీఆర్ కామారెడ్డిలో పోటీకి దిగిండని అన్నారు. ఇక్కడి రైతుల భూములు గుంజుకునెందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండని అన్నారు. ఎన్నికలున్నాయనే మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేసిండని తెలిపారు. ఎన్నికల తరువాత మళ్ళీ మీ భూములను గుంజుకుంటాడని తెలిపారు. కేసీఆర్ ను నమ్మడమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లే అన్నారు. కేసీఆర్ పాము లాంటి వాడు… ఓటు వేశారో.. మిమ్మల్ని కాటు వేస్తాడని తెలిపారు. కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగా అని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ గెలిచినా.. ఓడినా ఫామ్ హౌస్ లొనే పడుకుంటాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు.
RGV : రాజమౌళి వ్యాఖ్యలపై ఆర్జీవీ ఫన్నీ రియాక్షన్..