NTV Telugu Site icon

Revanth Reddy: కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా…

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పును దేశం నిశితంగా గమనిస్తోందన్నారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదని అన్నారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా వైశ్యులను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి 10లక్షలు, పిల్లల చదువుకు సాయపడేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Read also: Actor Kasthuri: తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న గృహలక్ష్మీ కస్తూరి..?

బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కామారెడ్డి ప్రాంతంలో భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఓటుకు పదివేలు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఆదమరచి కేసీఆర్ కు ఓటు వేస్తే… కోట్లాది రూపాయల విలువైన మీ భూములను కొల్లగొడతాడని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కామారెడ్డి రెడ్డి ప్రజలు గొప్ప తీర్పును ఇవ్వాలని కోరుతున్నా అని.. కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా అని హామీ ఇచ్చారు.
Manda Krishna Madiga : ముప్పై ఏళ్ల నుంచి పోరాడుతున్న.. అక్కున చేర్చుకుని మోడీ మాటిచ్చారు