Site icon NTV Telugu

KTR: సీఎంలో అపరిచితుడు ఉన్నాడు.. కేటీఆర్ ఘాటు విమర్శలు

Ktr

Ktr

KTR: కామారెడ్డి జిల్లా లింగంపేటలో బీఆర్‌ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించిన ఆత్మగర్జన సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎంలో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్‌లా కనిపిస్తాడు అని చెప్పుకొచ్చాడు. ప్రజలకు నిజమైన ముఖాన్ని చూపకుండా నటిస్తున్నాడు అని మండిపడ్డారు. ఇక, రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులు ఇంకా అందలేదు.. కానీ, మూటలు డిల్లీకి వెళ్తున్నాయి.. రాహుల్ గాంధీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయ్ అంటూ కేటీఆర్ ఆరోపించారు.

Read Also: Balakrishna Wife Vasundhara Devi: బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే..

ఇక, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఇప్పుడు కాగితాలు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెబుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ప్రజలను మోసగించడమేనన్నారు. ప్రభుత్వాన్ని నడిపించే వాడు నిజంగా బాధ్యత గల నాయకుడు అయితే సంపద, ఆదాయం పుడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మీ ఓటే తూటా.. కాంగ్రెస్ బట్టలు విప్పాలి అన్నారు. అలాగే, గురుకులాల్లో విద్యార్థులకు విషం పెడుతున్నారు.. ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు చనిపోయారు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version