Site icon NTV Telugu

Kamareddy: బిల్లులు చెల్లించండి.. ప్రభుత్వ పాఠశాలకు తాళాలు వేసిన కాంట్రాక్టర్..

Kamareddy

Kamareddy

Kamareddy: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ తాళాలు వేసిన ఘటన సంచలనంగా మారింది. బిల్డింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు తాళాలు తీయమని తేల్చి చెప్పాడు. పాఠశాల యాజమాన్యం ఎంత చెప్పిన కాంట్రాక్టర్‌ మాటలు పట్టించుకోలేదు. పిల్లలు ఎండలో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని, కొద్దిరోజులు గడువు ఇవ్వాలని యాజమాన్యం కోరిన కాంట్రాక్టర్‌ పాఠశాలకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆరు, ఏడు తరగతి విద్యార్థులకు చెట్ల కింద కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్నోసార్లు డిఇఓ దృష్టికి తీసుకెళ్లిన ప్రిన్సిపల్ ఫలితం లేదని చెప్పాడని వాపోయారు. పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు తాళం వేయడం వలన విద్యార్థులు ఎండలో అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వ అధికారులు పట్టించుకుని కాంట్రాక్టర్‌ తో మాట్లాడి పాఠశాలను తిరిగి తెరిపించాలని కోరారు. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని కోరుతున్నారు. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.
Ravi Basrur : ఎన్టీఆర్ పై అభిమానం చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌

Exit mobile version