Nizamabad MLC Kalvakuntla Kavitha Fired on Telangana BJP Leader at Twitter.
తెలంగాణలో వరిధాన్యం సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఇందిరాగాంధీ చౌక్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో కేంద్రం ఓ ప్రకటన చేయడంతో ధాన్యం కొనుగోలు విషయం తాత్కాలికంగా పక్కన పడింది. ఇప్పుడు మరోసారి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకునేందకు టీఆర్‌ఎస్ నేతలు నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంపై, తెలంగాణ బీజేపీ నేతలపై హాట్ కామెంట్స్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ నేతల కామెంట్స్ పై కవిత ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఆమె అన్నారు. అంతేకాకుండా ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని నిన్న కేసీఅర్ రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారన్నారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని, కేంద్రం పంజాబ్‌లో వడ్లు 100 శాతం కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుపై వన్ నేషన్ వన్ ప్రొక్యూర్‌మెంట్ ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.
