NTV Telugu Site icon

Kaleshwaram: కాళేశ్వరం జలాల ఎత్తిపోతల పథకం మళ్లీ షురూ..

Kalwshswaram

Kalwshswaram

Kaleshwaram: కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకం సిద్ధమైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మండలం లక్ష్మి పంప్‌హౌస్‌ వద్ద ఆదివారం రెండు పంపులను ఆపరేట్‌ చేసి నీటిని ఎత్తిపోశారు. దీంతో కింది నుంచి పై వరకు పథకం అందుబాటులోకి వచ్చింది. జూలై 14న గోదావరికి భారీగా వరద పోటెత్తడంతో ఈ పంప్ హౌస్ నీటమునిగిన సంగతి తెలిసిందే. పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోవడంతో వరద లోపలికి రావడంతో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయి. తొలుత రక్షణ గోడను పునరుద్ధరించిన అధికారులు నీటిని తొలగించి 20 రోజుల క్రితం మరమ్మతులు పూర్తి చేశారు.

Read: Macherla Clashes: పల్నాడులో పుట్టినవాళ్లు పీఎస్‌ గడప తొక్కకుండా ఉండరు..! కేసులకు భయపడం..

శనివారం 1, 2 పంపులను సిద్ధం చేసి ప్రయోగాత్మకంగా నడిపారు. ఆదివారం నీటిని తోడేశారు. ఈ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీకి చేరుతుంది. ఈ పంప్‌హౌస్‌లో మొత్తం 17 మోటార్లు ఉన్నాయి. ఒక్కో పంపు 2,200 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉంది. వీటిలో ఎనిమిది సిద్ధమయ్యాయి. పంపుల పునరుద్ధరణలో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ఈ కరుణాకర్, ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాష్, మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read: Nandamuri Taraka Ramarao: అమెరికా గడ్డపై అన్నగారి విగ్రహం…

లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) బ్యారేజీ సమీపంలోని సరస్వతి పంప్ హౌస్ కూడా మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఉన్న 12 పంపుల్లో ఇప్పటికే నాలుగు పంపులు సిద్ధం చేసి నీటిని ఎత్తిపోశారు. లక్ష్మీ, సరస్వతి పంప్‌హౌజ్‌లు పూర్తయితే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ఎగువ మట్టం వరకు నీటిని తరలించే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది యాసంగి పంటల అవసరాలకు 25 టీఎంసీల వరకు తరలించే అవకాశం ఉందని కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. యాసంగి పంటలకు సంబంధించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రెండోదశ ఆయకట్టుకు చివరి దశలో సాగునీరు అందించాల్సి ఉంటుందని వెల్లడించారు. సూర్యాపేట తదితర జిల్లాల్లో పంట చివరి దశలో సాగునీటి కష్టాలు తొలగిపోయాయని చెబుతున్నారు.
Waiting list Increase: దేవుడా.. సంక్రాంతికి సొంతూరుకు పెరిగిన వెయిటింగ్‌ లిస్టులు