Kadiyam Srihari: పొంగులేటి తానే నెంబర్ 2 అంటున్నారు ..భట్టి కి సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునా తీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ,హరీష్ రావు లు కృష్ణార్జునులు వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కోరారు. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని తెలిపారు.
Read also: RAM Trailer: ఏంట్రా ఒక్కదానికేనా.. రేపు పెళ్లయ్యాక ఏం చేస్తావ్! ఆకట్టుకుంటున్న రామ్ ట్రైలర్
తాజాగా.. వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుంచిన విషయం తెలిసిందే.. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను సొంత పార్టీగా భావించారని కానీ.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని కడియం అన్నారు. టీఆర్‌ఎస్‌తో ప్రజలకు అనుబంధం ఉండేదని, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్, అటాచ్‌మెంట్ పోయిందన్నారు. కాబట్టి ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌లోకి మార్చే విషయంలో పునరాలోచించాలని కేటీఆర్‌ను కడియం కోరారు. పార్టీ పేరుతో తెలంగాణను తొలగించడం వల్ల గత ఎన్నికల్లో నష్టం వాటిల్లిందని దీనివల్ల కనీసం 1-2 శాతం ఓట్లు గల్లంతయ్యాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని కడియం పేర్కొన్నారు. పార్టీలో కలసి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్‌ను దూరం చేయడం మంచిది కాదని, బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి మార్చాలని పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు.
CM Revanth Reddy: పెట్టుబడులకు అవకాశం ఉంది..13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి