NTV Telugu Site icon

K.A.Paul: నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది

Kapaul

Kapaul

K.A.Paul: నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరు అని మండిపడ్డారు. మొన్న సెక్రటరియెట్ వెళ్తే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్…తెలంగాణలో ఈ గుండాయిజం ఏంటి? అని పాల్‌ ప్రశ్నించారు. నన్ను హైదరబాద్ లో తెలంగాణాలో బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారా? అంటూ నిప్పులు చెరిగారు. అంబేడ్కర్ సెక్రటేరియట్ ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కులగొట్టడం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుందని సటైర్‌ వేశారు. దేవుడు కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నాడని అన్నారు. దేవుడికి నచ్చకనే సెక్రటరీయెట్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఎంతో కాలం చెల్లదని, కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపడాలని ఆయన మారాలని ఆకాంక్షించారు పాల్‌. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవలేడని, ప్రధాని ఏం అవుతాడు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేరు ఒకరిది… పండు ఒకరిదా? అంటూ మండిపడ్డారు.

Read also: Telangan Assembly: 24 గంటల విద్యుత్‌ సరఫరాతో రాష్ట్రంలో వెలుగులు.. సాఫీగా గవర్నర్‌ ప్రసంగం..

తెలంగాణ నూతన సచివాలయం కేసీఆర్ పుట్టినరోజు ప్రారభించడాన్ని సవాలు చేస్తూ కెఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు. సచివాలయం ప్రారంభంపై హైకోర్టులో పిల్ వేసానని, హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద నా వాదనలు వినిపించానని అన్నారు. ఏప్రిల్ 14 న అంబేద్కర్ పుట్టినరోజు నాడు నూతన సచివాలయం ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. నూతన సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు సచివాలయం ప్రారంభించాలని పిల్ దాఖలు చేశారు. ప్రతి వాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీలను చేర్చారు. పార్టీ ఇన్ పర్సన్ గా కె ఏ పాల్ వాదనలు వినిపిస్తామని తెలిపారు.
KTR Satirical Tweet: ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుండి.. ఖర్మరా బాబు