KA Paul: మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపరాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Announced Bumper Offer To Munugodu Unemployed Youth: మునుగోడు నిరుద్యోగ యువతకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించారు. తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్ట్‌తో పాటు అమెరికన్ విసాను ఉచితంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం.. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 50 వేల మంది నిరుద్యోగులు తమ రెజ్యూమ్‌లు తీసుకొని, సెప్టెంబర్ 25న శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కి రావాలని సూచించారు. తన జన్మదిన కానుకగా ఇస్తోన్న ఈ సదవకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను మంగళవారం విడుదల చేశారు.
ఇంకా ఎక్కువ మంది వస్తే.. ఒక్కో గ్రామం నుంచి ఒక్కొక్కరికి చొప్పున 175 గ్రామాల నుంచి 175 మందికి పాస్‌పోర్ట్ సహా అమెరికన్ వీసా స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తానని కేఏ పాల్ ప్రకటించారు. ఒక బీసీ కుటుంబంలో పుట్టి, దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న తనకు.. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్, సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పి.. ఇంతవరకూ ఆ హామీల్ని నెరవేర్చలేదని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఇంకా నిరుద్యోగులు ఎక్కువ అయిపోయారని చెప్పిన ఆయన.. ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో వారి మాటలు నమ్మకుండా, మనల్ని మనం అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎవరి డబ్బులు తనకు అవసరం లేదని.. మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని కేఏల్ పాల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!