K. Laxman: హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ కి కొత్తేమీ కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎల్లుండి రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజీ లో ఏర్పాట్లకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎల్లుండి రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజీ లో బిగ్ స్క్రీన్ ద్వారా లైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు… ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షoగా చూసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. అయోధ్యలో భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవం 22 న జరుగుతోందన్నారు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే రోజన్నారు. ప్రపంచం మొత్తం శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందన్నారు. బాబర్ దురాక్రమణలో అయోధ్య ద్వంసం అయ్యిందన్నారు. 1885 నుంచి రామా మందిరంపై కోర్టులో కేసు నడుస్తూ వచ్చిందన్నారు.
Read also: Babur Road Name Change: బాబర్ రోడ్ పేరు మార్చాలని హిందూసేన డిమాండ్
Also Read
అయోధ్య లో అనేక తవ్వకాలు జరిగిన తరువాత చివరికి అక్కడ రాముడి మందిరం ఉందని తేల్చి చెప్పాయన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. 1951 లో సోమానాదుని మందిర ప్రారంభోత్సవాన్ని సైతం అనాడు నెహ్రూ వ్యతిరేకించారని తెలిపారు. హిందు మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదన్నారు. లౌకికవాదం అంటే హిందు మనోభావాలను అవమానించడమా..? అని ప్రశ్నించారు. నగర ప్రజల కోసం నిజాం కాలేజీ గ్రౌండ్ లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళ సై, బండారు దత్తాత్రేయ రావడానికి సుముఖత చూపారన్నారు. దేశ ప్రజల కల ఈ నెల 22న నెరవేరబోతోందన్నారు. ప్రతిపక్షలు రాజకీయం చేయకుండా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు మద్దతు తెలుపాలన్నారు.
Meenaakshi Chaudhary: కాటుక కన్నులతో కవిస్తున్న మీనాక్షి చౌదరి…
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!