Ponguleti-Jupally: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీకి మారాయి. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి నేడు ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవనున్నారు. వీరిద్దరూ రేపు (26)న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జూపల్లి, పొంగులేటి వర్గాలకు చెందిన కొందరు ముఖ్య అనుచరులు కూడా పాల్గొన్నారు. రాహుల్‌తో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు మరికొందరు ముఖ్య నేతలు భేటీ అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈరోజు లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే పలువురు టీ కాంగ్రెస్ సీనియర్లు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు.
Read also: Health Tips: వానకాలంలో అల్లంతో అదిరిపోయే ప్రయోజనాలు..
అదే సమయంలో జూపల్లి, పొంగులేటి చేరికతో ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నేతలను కూడా ఢిల్లీ నుంచి పిలిపించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరే విషయమై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ తర్వాత ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో సభలు నిర్వహించే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ సభలకు రాహుల్ గాంధీ హాజరవుతారా? లేక ప్రియాంక గాంధీ టీ కాంగ్రెస్‌కు హాజరవుతారా? జూపల్లి, పొంగులేటి ఢిల్లీ పర్యటన అనంతరం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.
Health Tips: వానకాలంలో అల్లంతో అదిరిపోయే ప్రయోజనాలు..
