Jupalli Krishna Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు చారిత్రాత్మక కౌలాస్ కోటను జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోటను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌలాస్ కోట అభివృద్ధిపై త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో గ్రామాలు, తండాల్లో సౌకర్యాలు లేవు, అభివృద్ధి శూన్యమన్నారు. ఎల్లారం తాండాకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ వచ్చినా దాఖలాలు లేవని ఫైర్ అయ్యారు. రెవెన్యూ శివారు లేదు, గూగుల్ మ్యాప్ లో ఈ తాండా పేరే లేదని అంటున్నారని తెలిపారు. ఇదీ బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి అన్నారు.
Read also: Bhatti Vikramarka: సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసు..!
ఇవ్వన్ని చూసే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా… ప్రజల వద్దకు ప్రజా పాలన తెచ్చామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలను అమలు చేశారని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకే ప్రజా పాలనలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. దశల వారీగా మిగితా హామీలను అమలు చేస్తామన్నారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గం బీచ్కుందా మండలం రాజారాం తండాలో ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావుతో కలిసి ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని.. దరఖాస్తులు స్వీకరించారు. కౌలాస్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.
David Warner: అభిమానులను అలరించడానికే నిత్యం ప్రయత్నించా.. వీడ్కోలు సందర్భంగా వార్నర్ భావోద్వేగం!
