హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన జూబ్లీ హిల్స్ అమ్నేషియా పబ్ మైనర్ బాలిక కేస్ (Jubileehilsl minor girl case)లో నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరైంది. దీంతో జువైనల్ హోం నుంచి బయటకు వచ్చారు నలుగురు మైనర్లు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు నలుగురు మైనర్లు. ఎమ్మెల్యే కుమారుడు ఇంకా జువైనల్ హోమ్ లోనే ఉన్నాడు. గతంలో రెండు సార్లు బెయిల్ రిజెక్ట్ చేసింది జువైనల్ కోర్ట్. అనంతరం షరతులతో బెయిల్ మంజూరు చేసింది జువైనల్ కోర్ట్.
ఒక్కో మైనర్ కు 5 వేలు పూచీకత్తుతో బెయిలిచ్చింది. అయితే, విచారణ కు సహకరించాలని కండిషన్ పెట్టింది. హైదరాబాద్ డి పి ఓ ముందు ప్రతి నెల హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. ఇదిలా వుంటే ఇంకా జువెనైల్ హోం లో నే ఎం ఎల్ ఏ కుమారుడు వున్నాడు. మొదట జువెనైల్ బోర్డ్ బెయిల్ నిరాకరించడం తో హై కోర్టు లో అప్పీల్ చేసుకున్నాడు ఎమ్మెల్యే కొడుకు. అయితే హై కోర్టు లో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున ఇంకా హోం లో నే ఉండిపోయాడు ఎమ్మెల్యే తనయుడు. ఇదే కేస్ లో నిందితుడు సాదుదీన్ మాలిక్ బెయిల్ నిరాకరించింది కోర్టు.మైనర్ పై అత్యాచారం కేసుకు సంబంధించి నేరాన్ని నిరూపించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు.
ఈ కేసుకు సంబంధించి జూబ్లిహిల్స్ పోలీసులు 400 పేజీల ఛార్జ్‌షీట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్ లేబరీటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక, సీసీ ఫుటేజీలు, మొబైల్ డేటా, కాల్ సీడీఆర్‌లు కీలకం కానున్నాయి. పూర్తి ఆధారాలతో పోలీసులు ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నారు. మే 28వ తేదీన జూబ్లిహిల్స్ అమ్నేషియా బార్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా మూడు రోజుల అనంతరం బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాదుద్దీన్ మాలిక్ సహా నలుగురు మైనర్లను అరెస్టు చేశారు. ఈ కేసులో సాదుద్దీన్ మాలిక్, ఎమ్మెల్యే కొడుకు తప్ప మిగిలిన వారంతా బెయిల్ పై విడుదలయ్యారు. జూబ్లిహిల్స్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తే ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా..