జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వన్ డ్రైవ్‌లో పనిచేస్తున్న మైనర్ బెనర్జీ అరెస్ట్ అయ్యాడు. అక్కడి బాత్‌రూంలో సెల్‌ఫోన్ చూసి ఓ యువతీ ఫిర్యాదు చేసింది. బాత్‌రూంలో సెల్‌ఫోన్ ద్వారా బెనర్జీ వీడియోల చిత్రీకరణ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కొత్త సెల్‌ఫోన్ కొన్నాడు బెనర్జీ. ఆ సెల్‌ఫోన్ తీసుకెళ్లి లేడీస్ బాత్‌రూంలో పెట్టి రికార్డ్ చేసేవాడు బెనర్జీ. నాలుగున్నర గంటలపాటు బాత్‌రూం దృశ్యాలను చిత్రీకరించాడు బెనర్జీ.
అయితే యువతీ ఫిర్యాదు తర్వాత వన్ డ్రైవ్‌లో పనిచేస్తున్న హౌస్ కీపర్ బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెనర్జీతో పాటు వన్ డ్రైవ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయిస్తున్నారు యువతులు. వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక వన్ డ్రైవ్ యజమాని చైతన్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.