Site icon NTV Telugu

Jubilee Hills By Poll : రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్..

Jubilee Hills By Election

Jubilee Hills By Election

Jubilee Hills By Poll : హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సోమవారం (అక్టోబర్ 13) విడుదల చేయనుంది. నామినేషన్ల సమర్పణ అక్టోబర్ 13 నుంచి 21 వరకు కొనసాగుతుంది, ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలను మినహా అన్ని రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో సమర్పించవచ్చు. ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా పూర్తి అయ్యేలా అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందుబాటులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.

నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించబడ్డారు. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. కౌంటింగ్ నవంబర్ 14న యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో పూర్తయ్యి ఫలితాలు ప్రకటించబడతాయి.

ఎన్నికల సంఘం ENCORE పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు https://encore.eci.gov.in ద్వారా నామినేషన్ ఫారం ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అయితే QR కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి. ఆన్‌లైన్ డిపాజిట్ బ్యాంక్/ట్రెజరీలో క్రెడిట్ అయి ఉండకపోతే మాన్యువల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు రిటర్నింగ్ ఆఫీసర్‌ను సంప్రదించాలనున్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల వివరాలు: నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు, ఇందులో 2,07,367 పురుషులు, 1,91,590 మహిళలు మరియు 25 మంది ఇతరులు ఉన్నాయి. 80 ఏండ్లకు పైబడిన వృద్ధులలో పురుషులు 3,280, మహిళలు 2,772 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 95 మంది, సర్వీస్ ఎలక్టోరల్స్ 18, పీడబ్ల్యూడీ ఓటర్లు 1,891 మంది నమోదు అయ్యారు. నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ ఉప ఎన్నిక, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఏర్పడింది, కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది.

Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..

Exit mobile version