NTV Telugu Site icon

Gadwal Politics: హాట్ హాట్ గద్వాల్ రాజకీయాలు.. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

Gadwal Politics

Gadwal Politics

Gadwal Politics: గద్వాల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీంతో గద్వాల్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం అయ్యిందనే వార్త గద్వాల్ రాజకీయాల్లో వినూత్న పరిమాణాలకు దారితీసింది. మండలాలవారీగా అనుచర వర్గంతో సమాలోచనలు అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎమ్మెల్యే చేరికను వ్యతిరేఖిస్తున్న గద్వాల్ కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత వర్గం ఎమ్మెల్యే ను చేర్చుకోవద్ధని కాంగ్రెస్ నాయకులు నిరసనలకు దిగారు. ఓ కార్యకర్త ఏకంగా టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు.

Read also: Minister Seethakka: పార్లమెంట్ లో అల్లూరి విగ్రహంపై కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి..

గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నరు వార్త హాట్ టాపిక్ గా మారింది. దీంతో జెడ్పీ చైర్ పర్సన్ సరిత అభిమానులు నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని రోడ్డు పై బైఠాయింది ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులు సరితా తిరుపతియ్యకు వినతిపత్రాలు సమర్పించారు. ఇవాళ జిల్లా నల్లగుంట ప్రాంతంలో సరిత తిరుపతయ్య అభిమాని ప్రసాద్ సెల్ టవర్ ఎక్కి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే టవర్ పై నుంచి కింది దూకేస్తానని బెదిరించి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో అక్కడ గందగోళ పరిస్థితి నెలకొంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ నచ్చజెప్పి కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఘటన స్థలానికి చేరుకున్నారు.
Stock Market : స్టాక్ మార్కెట్లో కాసుల వర్షం.. 45నిమిషాల్లో రూ.2.71లక్షల కోట్లు

Show comments