NTV Telugu Site icon

ACB: రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీపీఓ శ్యామ్ సుందర్..

Acb

Acb

లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని తెలిసినప్పటికీ లంచావతారులు మారడం లేదు. లంచ రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అధికారులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏసీబీ అధికారులు లంచగొండుల భరతం పడుతున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఓ డీపీవో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ నుంచి లంచం వసూలు చేసేందుకు రెడీ అయ్యారు డీపీవో శ్యామ్ సుందర్. వెంచర్ మేనేజర్ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకోవాలని పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సూచించాడు.

Also Read: Oh Bhama Ayyo Rama: వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘ఓ భామ అయ్యో రామ’ పోస్టర్ విడుదల..

అయితే వెంచర్ మేనేజర్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో పంచాయతీ సెక్రటరీ అడ్డంగా దొరికిపోయాడు. డీపీవో సూచన మేరకు రూ. 2లక్షలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఉన్న పలంగా పట్టుకున్నారు. ఉండవెల్లి మండలంలో పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన సిబ్బందితో కలిసి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీపీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.