Jeevitha Rajashekar: పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో తన భర్త రాజశేఖర్‌తో కలిసి పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉన్నానన్న జీవిత.. ఇప్పుడు పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మోడీ పాలన దేశానికి శ్రీరామరక్ష అని , పార్టీ ఎలాంటి పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
KTR: పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?.. ప్రధానికి కేటీఆర్ కౌంటర్
తెలంగాణలో ఆడవాళ్లకు రక్షణ కావాలంటే బీజేపీ పాలన రావాలన్నారు. మోడీ బారతదేశాన్ని కాపాడగలరనే విశ్వాసంతోనే మొదటి నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపట్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఈరోజు 11వ రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో జీవిత రాజశేఖర్ సంజయ్‌తో కలిసి పాదయాత్ర చేసారు. జీవితతో పాటు ఆమె భర్త రాజశేఖర్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఈమధ్య కాలంలోనే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
