NTV Telugu Site icon

Telangana Ministers: భూపాలపల్లి జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర పర్యటన..

Sridhar Babu, Damodara Raja Narasimha

Sridhar Babu, Damodara Raja Narasimha

Telangana Ministers: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,దామోదర రాజ నర్సింహ పర్యటించనున్నారు. హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ఇద్దరు మంత్రులు బాగిద్దిపేట చేరుకుంటారు. మంత్రుల రాక కోసం అధికారులు హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బుద్దారం నుండి కొడవటంచ రహదారి కిమీ 3/0 నుండి 18/2 వరకు, రామన్నగూడెం తండా స్టేజీ మీదుగా NH353C, భాగీర్తిపేట వరకు 2/2 మరియు 2/4 వద్ద హైలెవల్ వంతెనల నిర్మాణంతో సహా అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.

Read also: LK Advani: ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు

మంత్రుల షెడ్యూల్ ఇలా..

* మధ్యాహ్నం 12:15 గంటలకు కొత్త ఆయుష్ 50 పడకల ఆసుపత్రి,భూపాలపల్లి ప్రారంభోత్సవం (అంచనా వ్యయం 15 కోట్లు)

* మధ్యాహ్నం 12:30 గంటలకు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల భవన సముదాయానికి శంకుస్థాపన (అంచనా వ్యయం 130 కోట్లు)

* మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్,భూపాలపల్లిలో 4వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం 7 కోట్లు)

* మధ్యాహ్నం 1:00 గంటలకు GGH భూపాలపల్లిలో మొగుళ్లపల్లె మండలానికి నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవం.

* మధ్యాహ్నం 1:00 గంటలకు భూపాలపల్లి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులతో సమీక్షా సమావేశం.

* మధ్యాహ్నం 1:45 గంటలకు భూపాలపల్లి మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహం నుండి 2-ఇంక్లైన్ వరకు BT రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం 4 కోట్లు)

* మధ్యాహ్నం 2:00 గంటలకు అంబేద్కర్ సెంటర్,భూపాలపల్లిలో బహిరంగ సభ.
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి విజయ్ దేవరకొండ