NTV Telugu Site icon

Kaleshwaram: కాళేశ్వరంలో కమ్మేసిన పొగమంచు.. భక్తులు తీవ్ర ఇబ్బందులు..

Mahadevapur Mandal Kaleswaram Is Foggy, Mahadevapur Mandal ,kaleswaram Is Foggy

Mahadevapur Mandal Kaleswaram Is Foggy, Mahadevapur Mandal ,kaleswaram Is Foggy

Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఉదయం పొగమంచు కమ్మెసింది. ఉదయం 8 గంటల వరకు త్రివేణి సంగమ గోదావరి తీరంలో పొగమంచు కమ్మేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పరిసరాలు కూడ పొగమంచు కప్పేసింది. దీంతో పుణ్యాస్నానాలు ఆచరించే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read also: NTV Effect: గోదావరి తీరంలో దుర్గంధ ఘటన.. సిబ్బందితో వర్థ్యాలు తొలిగింపు..

జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు పొగ‌మంచు క‌మ్మేసింది. ప‌ల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కశ్మీరాన్ని త‌ల‌పిస్తుంది. ఇవాళ ఉద‌యం నుంచే ద‌ట్టంగా పొగ‌మంచు కురుస్తుండ‌టంతో ర‌హ‌దారిపై హెడ్ లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహ‌నాలు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. జిల్లాల్లో ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో కశ్మీరాన్ని తలపిస్తుంది. ఉదయం రహదారుల్లో నడవాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎదుటి వాహనాలు కూడా మంచులో కనిపించకపోవడంతో రహదారుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంంటున్నారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

మరోవైపు పటాన్చెరు, రామచంద్రపురం, లింగంపల్లి ,అవుటర్ రింగ్ రోడ్డు ,ముత్తంగి, ఇస్నాపూర్ లో పొగ మంచు కమ్మేసింది. వాహనదారులు తమ వాహనాలకు లైట్లు ఆన్ చేసుకొని నడుపే పరిస్థితి వచ్చింది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు పాదచారులు కనిపించడం కష్టంగా మారింది. విద్యార్థులకు స్కూల్ టైం, ఆఫీస్ వాళ్లకు జాబ్ టైం రోడ్డు క్రాస్ చేయాలంటే పొగ మంచు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించడం లేదు. దీంతో జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయవలసి వస్తుంది. వికారాబాద్ జిల్లాలో భారీగా మంచు కమ్మేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనచోదకులు దగ్గరికి వచ్చే వరకు ఒక వాహనానికి మరో వాహనం కనబడకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులు వాపోతున్నారు.
Telangana TET Notification: నేడు టెట్ నోటిఫికేషన్… జాబ్ కేలండర్ ప్రకారం నిర్వహణ..

Show comments