Site icon NTV Telugu

Pending Challans: వాహనదారులు అలర్ట్.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ రేపే లాస్ట్ డేట్..

Pending Challan

Pending Challan

Pending Challans: వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ రేపటితో అనగా..జనవరి 10న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు చెల్లించని వారు ఎవరైనా ఉన్నట్లయితే.. వెంటనే చెల్లించడం మంచిదని తెలిపారు. ఎందుకంటే.. మళ్లీ అలాంటి ఆఫర్ రాకపోవచ్చని క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీ ప్రకటించారు. బైక్‌లపై 80 శాతం తగ్గింపు. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే డిసెంబర్ 25 తర్వాత చెల్లించే చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదని.. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న చలాన్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read also: Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్?

గతంలో ఒకసారి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై రాయితీ ప్రకటించారు. అప్పుడు 50 శాతం తగ్గింపు ఇచ్చారు. మార్చి 31, 2022 నాటికి 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉంటే, రాయితీల ద్వారా రూ.300 కోట్ల వరకు చలాన్ ఫీజులు వసూలు చేయబడ్డాయి. అందుకే ఈసారి కూడా అదే తరహాలో తగ్గింపు అవకాశాన్ని కల్పించారు. గడువు ముగిసిన తర్వాత రాయితీ లభించదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం ఉందన్నారు. ఏవైనా సందేహాలుంటే 040-27852721, 8712661690 వాట్సాప్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చని కోరారు. రేపు లాస్ట్ డేట్ కావడంతో వాహనదారులకు అలర్ట్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనదారులు పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే చెల్లించాలని కోరారు. రేపు ఒక్కరోజు మిస్ అయితే.. డిస్కౌంట్ వర్తించదని తెలిపారు.
Formula E Race: ఫార్ములా-ఈ రేస్‌కు కోట్లలో చెల్లింపులు.. సీనియర్ IAS అరవింద్ కుమార్‌కు మెమో..!

Exit mobile version