Pending Challans: వాహనదారులు అలర్ట్.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ రేపే లాస్ట్ డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pending Challans: వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ రేపటితో అనగా..జనవరి 10న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించని వారు ఎవరైనా ఉన్నట్లయితే.. వెంటనే చెల్లించడం మంచిదని తెలిపారు. ఎందుకంటే.. మళ్లీ అలాంటి ఆఫర్ రాకపోవచ్చని క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీ ప్రకటించారు. బైక్‌లపై 80 శాతం తగ్గింపు. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే డిసెంబర్ 25 తర్వాత చెల్లించే చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదని.. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న చలాన్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read also: Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్?
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
గతంలో ఒకసారి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై రాయితీ ప్రకటించారు. అప్పుడు 50 శాతం తగ్గింపు ఇచ్చారు. మార్చి 31, 2022 నాటికి 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉంటే, రాయితీల ద్వారా రూ.300 కోట్ల వరకు చలాన్ ఫీజులు వసూలు చేయబడ్డాయి. అందుకే ఈసారి కూడా అదే తరహాలో తగ్గింపు అవకాశాన్ని కల్పించారు. గడువు ముగిసిన తర్వాత రాయితీ లభించదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్లైన్లో చెల్లించే అవకాశం ఉందన్నారు. ఏవైనా సందేహాలుంటే 040-27852721, 8712661690 వాట్సాప్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చని కోరారు. రేపు లాస్ట్ డేట్ కావడంతో వాహనదారులకు అలర్ట్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనదారులు పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే చెల్లించాలని కోరారు. రేపు ఒక్కరోజు మిస్ అయితే.. డిస్కౌంట్ వర్తించదని తెలిపారు.
Formula E Race: ఫార్ములా-ఈ రేస్‌కు కోట్లలో చెల్లింపులు.. సీనియర్ IAS అరవింద్ కుమార్‌కు మెమో..!
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!