Site icon NTV Telugu

MLA Sanjay Kumar: కేటీఆర్ మాటలు బాధించాయి.. సంజయ్ కుమార్ ఆవేదన..

Mla Sanjay Kumar

Mla Sanjay Kumar

MLA Sanjay Kumar: కేటీఆర్ మాటలు నన్ను బాధించాయని, విమర్శలు చేసినవారు అత్మ విమర్శలు చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కొసం కాంగ్రెస్ లో చేరానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమని భావించా అని తెలిపారు. రైతుల కోసం రుణమాఫి చేయడానికి ప్రక్రియ ప్రారంభం చేసారు ముఖ్యమంత్రి అని తెలిపారు. తెలంగాణలొ ఎక్కడ లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్ రూం కట్టించాం.. దీనికి‌ సంబంధించిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మా కుటుంబం అంతా కాంగ్రెస్ లోనే ఉన్నారని తెలిపారు. నేను బిఅర్ఎస్ లోకి వచ్చినప్పుడు కనీసం ఒక్క కౌన్సిలర్ లేని పరిస్థితి అన్నారు.

Read also: Akhil: అయ్యగారు ఎక్కడా తగ్గట్లేదు.. ఈసారి లెక్కేసి కొట్టడమే!

మొదటిసారి ఓడిపోయినా కవితగారి సహకారం తో బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంతెన్ చేసానని అన్నారు. డబుల్ బెడ్ రూం కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే మా బంధువుతో కట్టించానని తెలిపారు. నన్ను రెండవసారి ఎమ్మెల్యే గా గెలిపించినందుకు నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. కేటిఅర్ మాటలు నన్ను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు చేసినవారు అత్మ విమర్శలు చేసుకోవాలని క్లారిటీ ఇచ్చారు. గతంలో వేరే పార్టీలో గెలిచినవారిని ఎలా చేర్చుకోన్నారన్నారు. జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యమని తెలిపారు. నేను ఒక డాక్టర్ ని, చాలా కుటుంబాలని సాదుకునేంత అర్థికంగా ఉన్నవాడిని అన్నారు.
Turmeric Milk : రోజూ పసుపు పాలు తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. మీరు ట్రై చేయండి..

Exit mobile version