NTV Telugu Site icon

Jagtial News: సార్ కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల యువకుడి ఆవేదన..

Jagital

Jagital

Jagtial News: మంచి జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్లను నమ్మ మోసపోయనని ఓ యువకుడు సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. ఓ ఏజెంట్‌ గల్ఫ్‌ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఇక్కడి వచ్చానని వాపోయాడు. తన మాటలు నమ్మి వస్తే గదిలో బంధించాడని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ కు చెందిన పల్లపు అజయ్ రూ.2.70 లక్షలతో 14 నెలల క్రితం ఇరాక్ వెళ్లాడు. అజయ్‌కు ఉపాధి కల్పించేందుకు ఇరాక్‌లో వున్నవారికి ఏజెంట్.. అప్పగించాడు. అయితే వారు పని కల్పించకుండా అజయ్ పాస్ పోర్టు తీసుకున్నారు.

Read also: MBBS Seats: విద్యార్థులకు హరీష్ రావు శుభాకాంక్షలు..

అయితే ఇరాక్‌ లో వున్నందున వారి భాష రాక, బయటకు వెళ్లలేక బాధ అనుభవిస్తున్నానని అజయ్ తల్లిదండ్రులు రాధ, గంగయ్యలకు కన్నీరు పెట్టుకుంటూ సమాచారం అందించాడు. ఐదు నెలల క్రితం ఏజెంట్ ఇండియాకు రాగా.. అజయ్ తల్లిదండ్రులు అతడిని నిలదీశారు. దీంతో ఏజెంట్‌ రూ.లక్ష తిరిగి ఇచ్చాడు. వారు అజయ్‌కి డబ్బు పంపారు. భారత్‌కు రావడానికి పాస్‌పోర్టు లేదని తల్లిదండ్రులకు తెలియజేయడంతో మళ్లీ నెల రోజుల కిందటే రూ.66 వేలు పంపారు. అజయ్ రోజూ పస్తులతో ఇబ్బందులు పడుతున్నాడని సెల్ఫీ వీడియో పంపించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read also: Bathukamma 2024: నేడు వేపకాయ బతుకమ్మ.. ఏం చేస్తారంటే..

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి హౌస్ కీపింగ్ ఉద్యోగం పేరుతో సౌదీ వెళ్లాడు. ఎడారిలో ఏజెంట్‌ వదిలేశారంటూ తనను కాపాడాలని హైదరాబాద్ కు తీసుకుని వెళ్లాలని సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్న నేపథ్యంలో ప్రభుత్వ చొరవతో గల్ఫ్ బాధితుల సంఘం నాయకులు ఈ నెల 1న శంషాబాద్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే..
Heartbreaking Incident: కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే ఇంటికి వెళదాం..