Site icon NTV Telugu

Jagtial Bride Suicide: చిన్న గొడవ.. పెళ్లైన వారం రోజులకే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..

Jgtl

Jgtl

Jagtial Bride Suicide: ఔను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు, ఇరు కుటుంబాలను ఒప్పించి మరి రెండు కుటుంబాల అనుమతితో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో గానీ చిన్నపాటి మనస్పర్థలతో ఆ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

Read Also: Israel-Hamas: తక్షణమే బందీలను విడుదల చేయండి.. హమాస్‌కు ఇజ్రాయెల్ సూచన

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు గంగోత్రి అదే ఊరికి చెందిన అల్లిపు సంతోష్ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో.. గత నెల 26వ తేదీన పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే, దసరా పండగ సందర్భంగా గంగోత్రి ఇంటికి కొత్త దంపతులు ఇద్దరూ వెళ్లారు. ఇక, భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇరువురికి తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి గంగోత్రి- సంతోష్ తమ ఇంటికి వెళ్లిపోయారు.

Read Also: Kondapur Demolitions: హైకోర్టు తీర్పుతోనే కొండాపూర్‌లో కూల్చివేతలు.. హైడ్రా సంచలన వ్యాఖ్యలు

అయితే, గురువారం రాత్రి సమయంలో మళ్లీ ఏమైన గొడవ జరిగిందో ఏమోగానీ తెల్లారే సరికి గంగోత్రి ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక, విషయం తెలుసుకున్న గంగోత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన ప్రదేశానికి చేరుకొని విచారణ చేపట్టారు. భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు జరిగాయా, అందుకే గంగోత్రి మనస్థాపంతో సూసైడ్ చేసుకుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Exit mobile version